Life Quotes in Telugu

Updated On:
Life quotes in telugu
---Advertisement---

గుర్తుపెట్టుకో

చేసిన అవమానాలు

పెట్టిన బాధలు

వెనక తీసిన గోతులు

ముందు పలికిన నీతులు

అన్ని గుర్తున్నాయ్

లెక్క కట్టి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా

ప్రామిస్

పదిమంది మనం చేసే ప్రతీ పనిని ప్రశంసించాలని

ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది.

ఆత్మ విశ్వాసం లేకపోవడమే

అపజయాలకు గల ముఖ్య కారణం.

కాలం విలువ తెలియని వాడు

జీవితం విలువ అర్థం చేసుకోలేడు.

ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు.

అలాగే కష్టాల పరంపర చుట్టూ ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.

కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు.

నారుపోసినంత మాత్రాన పంట పండదు కదా.

నీ బాధ్యతలను నీవు సరిగ్గా తెలుసుకున్నప్పుడు,

నీ ఆశయాలను పూర్తిచేసుకోవాలనే తపన నీలో కనిపిస్తుంది.

జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా

మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది,

మనతో ఉన్నప్పుడే వాటి విలువను తెలుసుకోవాలి.

ఎక్కువగా వేచి చూడకు,

సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.

ఎక్కువగా నమ్మటం,

ఎక్కువగా ప్రేమించటం,

ఎక్కువగా ఆశించటం వల్ల

వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

అందమైన జీవితం వెతికితే దొరకదు,

మనం నిర్మిస్తే తయారవుతుంది.

ప్రయత్నం మానేస్తే మరణించినట్టే!

ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే!!

కిందకి లాగే వాళ్ళకి ఏం తెలుసు,

ఈ స్తాయికి రావడానికి నువ్వు ఎంత కస్టపడ్డావు అనేది..!

మనం బాగుంటే చూడలేనోల్లు అందరూ,

నీ బాగు కోరుకునే వాళ్ళలా భలే నటిస్తూ ఉంటారు..!

కొన్నిసార్లు అలవాట్లనే కాదు,

అలవాటు అయిన వారిని కూడా మర్చిపోక తప్పదు..!

సమయం వచ్చినపుడే కొన్నిటికి

స్పందించడం మంచిది..!

ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

“మనవాడు, మన ఊరివాడు, మన కులం”

అని నమ్మితే మోసపోక తప్పదు.

కష్టపడి పని చేయడం ఇష్టం లేని వారే,

నుదిటిమీద రాతల గురించి మాట్లాడతారు..!

కోట్ల రూపాయలు పెట్టినా దొరకని జ్ణానం,

వయసులో మన కంటే పెద్దవాళ్ళతో

స్నేహం చేయడం వల్ల లభిస్తుంది..!

ఎప్పుడైనా మన స్థాయిని మించి

ఆలోచించవచ్చు, ఆశ పడవచ్చు. కానీ,

ఖర్చు మాత్రం స్థాయిని మించి పెట్టకూడదు..!

కాలం ప్రతీదానికీ

సైరైన టైంలో,

సరైన సమాదానం చెప్తుంది.

ఓపికతో ఎదురు చూడాలి..!

మనల్ని “తొక్కేయడానికి”

చుట్టూ ఎంత మంది ఉన్నా,

మనల్ని కాపాడేది మాత్రం

మనం చేసుకున్న “మంచి” మాత్రమే..!

నోరుంది కదా అని అరిచినంత మాత్రాన

నువ్వు బలవంతుడవని కాదు,

అవతలోడు మౌనంగా ఉన్నతమాత్రాన

వాడు చేతకానోడని కాదు.

ఈ రోజుల్లో ఎక్కువగా మనసుకి

గాయం చేసేది రక్తసంబందికులే..!

సోమరిపోతు దొరికిన దానిని కూడా

రక్షించుకోలేడు..!

వెళ్ళే “వేగం” కన్నా,

వెళ్ళాలీ అనుకునే “దారి” చాలా ముఖ్యం..!

చెత్త ఉన్న చోట ఎలా ముక్కు మూసుకుంటామో,

చెడ్డ వాళ్ళు ఉన్నచోట కూడా

నోరు మూసుకుని వెళ్ళడం అంతే మంచిది..!

ఈ రోజుల్లో మనిషి పతనానికి 3 కారణాలు.!

జాలి.

అధిక నమ్మకం.

అధిక ప్రేమ.

కొన్నాళ్ళు కొన్ని కోల్పోతేనే,

కొన్నేళ్ళకు కొన్ని అందుకుంటావు..!

మనకి కావలసిన దాని కోసం శ్రమించకుండా,

పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం

మూర్ఖత్వమే అవుతుంది..!

కన్నీళ్లు చాలా విలువైనవి,

విలువ లేని వాళ్ల కోసం

వాటిని వేస్ట్ చేయకూడదు.

చేసే ప్రయత్నంలో,

గెలిస్తే గౌరవం, ఓడిపోతే అనుభవం వస్తుంది.

ఏది జరిగినా మన మంచికే..!

నింద నిజమైతే తప్పు సరిదిద్దుకో.

అబద్ధం అయితే నవ్వేసి ఊరుకో…

రోగం లేని శరీరం.
వేదన లేని మనసు.
ఇవే మనిషికి తరగని ఆస్తులు.

మనది కాని దానికోసం ఆశ పడుతున్నాము అంటే,

మనకి ఉన్నది కూడా పోగొట్టుకోవడానికి సిద్దపడినట్టే..!

నటనకు అలవాటుపడిన సమాజంలో,

నువ్వు నీలా ఉండడం కూడా నేరమే..!

అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం జవాబుదారీతనం,

ప్రశ్నించిన వారిని నిందించడం చేతకానితనమే అవుతుంది..!

ఒక చిన్న నమ్మక ద్రోహం

జీవితం మొత్తాన్నే తలకిందులు చేస్తుంది.!

జాగ్రత్త మిత్రమా!

ఇతరులు మనపట్ల ఎలా ఉండాలి అని కోరుకుంటామో,

ఇతరుల పట్ల మనం కూడా అలా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం..!

మనిషికి ఆకలి వేయడం ఎంత సహజమో,

అవసరం రావడం కూడా అంతే సహజం..!

ఈ రోజుల్లో “బరువు”ను మోసే మనిషి కంటే,

“ఆలోచనలు” మోసే మనుషులకే బరువెక్కువ..!

అడగని వారికి ఇచ్చే సలహా,

ఆశక్తి లేని వారికి నేర్పే విద్య రెండూ వృధా..!

ఎక్కడైతే “ఆశపడడం” జరుగుతుందో,

అక్కడే “లొంగిపోవడం” కూడా జరుగుతుంది.

అవకాశం ఉన్న వాళ్ళకి అర్దం కాదు.

అర్దమైన వాళ్ళకి అవకాశం ఉండదు.

ఇదే జీవితం..!

విజయాన్ని నిరంతరం నిలబేట్టుకోవడమే

విజేతలకు ఎదురయ్యే అసలైన సవాలు..!

మొదట్లో కస్టంగా అనిపించే మార్గం,

వాస్తవానికి ముందుకు వెళ్ళే కొద్దీ

అదే సులభంగా అనిపిస్తుంది..!

మనల్ని చేతలతో గెలవలేని వాళ్ళే,

మాటల్తో గతాన్ని తవ్వి,

అవమానించడం మొదలు పెడతారు..!

కోల్పోయినప్పుడు కాదు,

కోలుకున్నప్పుడు అర్దమవుతుంది.

జరిగింది అంతా మన మంచికే అని..!

నిజాన్ని నిప్పులో కాల్చేసినా,

సమాధిలో పూడ్చేసినా,

ఏదో ఒక రోజు కాలం దాన్ని వెలికి తీస్తుంది..!

పక్కోడి కంచంలో బువ్వ లాక్కుంటే

ఈ రోజు నీ కడుపు నిండుతుందేమో కానీ,

ఈ పాపం రేపు నీ బిడ్డలకి “శాపంగా” మారుతుంది..!

అన్నిటికీ కంగారు పడకూడదు.

కొన్నిసార్లు సామర్ద్యం వల్ల అవ్వని పని

మన సహనం వల్ల అవుతుంది..!

సమస్యల్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే,

క్షేమంగా ఉన్నప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి..!

నిన్ను నమ్మిన వ్యక్తిని నువ్వు ఎంత బాధ పెడతావో,

అంతకు మించిన బాధను నువ్వు కచ్చితంగా అనుభవిస్తావు..!

మన పరిస్థితిని బట్టే ఎదుటివారు

మనల్ని పలకరించే విధానం

ఆధారపడి ఉంటుంది.

నవ్వుతూ చేసే పాపాలు,

ఏడుస్తూ అనుభవిస్తారు..!

కోపాన్ని ఎప్పుడూ “ఉప్పులా” ఉపయోగించాలి.

తక్కువ అయితే మర్యాద ఉండదు,

ఎక్కువ అయితే విలువ ఉండదు!

ఒత్తిడి లేని జీవితం కావాలి అంటే,

ఇతరులతో పోల్చుకోవడం మాని

వాస్తవాలను స్వీకరిస్తూ

ముందుకు వెళ్లడమే..!

గొప్పల కోసం అప్పులు చెయ్యకు..

అప్పులు లేకుండా బ్రతకడం కూడా గొప్పే..!

అర్ధం లేని ఆవేశం అనేక సమస్యలకు దారితీస్తుంది.

ఆలోచన లేని నిర్ణయం అనేక బాధలకు సరణమౌతుంది.

Life Quotes in Telugu | Inspirational & Motivational Telugu Quotes

జీవితం అనేది ప్రతి ఒక్కరి అద్భుతమైన ప్రయాణం, ఇందులో సంతోషం, దుఃఖం, గెలుపులు, ఓటములు అన్నీ ఉంటాయి. చాలా మంది కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ప్రేరణ కోసం Life Quotes in Telugu చదవడం ఇష్టపడతారు ఎందుకంటే చిన్న చిన్న మాటలు కూడా మనసుకు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఉదాహరణకు “జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది, ప్రతి రోజు కొత్త పేజీ” అనే కోట్ మనకు కొత్త ఆరంభం చేసే ధైర్యం ఇస్తుంది, అలాగే “కష్టాలు రాకపోతే విజయానికి విలువ ఉండదు” అనే కోట్ మనకు కష్టపడే శక్తి పెంచుతుంది. నిజానికి Telugu Quotes on Life మన ఆలోచన విధానాన్ని మార్చగల మాటలు ఉంటాయి. “మనసు బలంగా ఉంటే ఏ అడ్డంకి పెద్దది కాదు” అనే కోట్ మనకు మానసిక బలం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది, “జీవితం చిన్నది, దానిని సంతోషంగా గడపడం నేర్చుకో” అనే వాక్యం మనకు సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని ఆనందించమని చెబుతుంది. Jeevitha Prerakalu అంటే జీవితం లో ముందుకు సాగడానికి ప్రేరణ ఇచ్చే కోట్స్, ఉదాహరణకు “సమస్యలు మనల్ని ఆపవు, అవి మన బలాన్ని పెంచుతాయి” లేదా “ఆశతో బ్రతకడం అనేది జీవితం లో గొప్ప శక్తి” లాంటి మాటలు మనం కష్టాల్లో ఉన్నప్పటికీ మనకు నమ్మకం, ధైర్యం కలిగిస్తాయి. విజయాన్ని పొందాలనుకునే వారు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవలసిన మాట “విజయం పొందాలంటే ఓర్పు, కృషి రెండూ అవసరం” ఎందుకంటే patience మరియు hard work లేకుండా success రావడం అసాధ్యం. Telugu Success Quotes కూడా మనకు ఎన్నో పాఠాలు చెబుతాయి, ఉదాహరణకు “ఎంత సార్లు పడిపోతామన్నది ముఖ్యం కాదు, చివరికి లేవడం ముఖ్యం” అనే కోట్ మనం ఎన్ని సార్లు fail అయినా చివరికి rise అవ్వడం నేర్పుతుంది. జీవితం లో positive attitude చాలా ముఖ్యం, “ప్రతి ఉదయం కొత్త అవకాశాలను తెస్తుంది” అనే కోట్ మనకు ప్రతి రోజు ఒక fresh start అని గుర్తు చేస్తుంది, “నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకుంటే ప్రపంచమే నీ ముందు తలవంచుతుంది” అనే వాక్యం self-confidence importance ని తెలియజేస్తుంది. మనం ఈ కోట్స్ ని WhatsApp status, Instagram captions, Facebook posts లో ఉపయోగించవచ్చు, అలాగే స్నేహితులతో షేర్ చేస్తే వాళ్లకూ ప్రేరణ ఇస్తాయి. Motivational Life Quotes in Telugu చదవడం వల్ల మనలో self-belief పెరుగుతుంది, మనసు బలపడుతుంది, కష్టాలు ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. జీవితం ఎప్పుడూ సజావుగా ఉండదు కానీ మన ఆలోచనలే దాన్ని అందంగా మార్చగలవు. కాబట్టి ప్రతి రోజు కనీసం ఒక Life Quote చదవడం అలవాటు చేసుకుంటే మన ఆలోచనలు positive అవుతాయి, విజయ దిశగా మన ప్రయాణం సులభమవుతుంది. చివరగా చెప్పుకోవలసింది ఏమిటంటే జీవితం అనేది చిన్నది కానీ meaningful గా గడిపితే అది అందరికీ ఒక ప్రేరణగా నిలుస్తుంది, అందుకే ఈ Life Quotes in Telugu మీ జీవితం లో స్ఫూర్తిని నింపుతాయి, మీ ఆలోచనలకు కొత్త దిశ చూపుతాయి, మీ కలలను నిజం చేసే శక్తిని ఇస్తాయి.

Discover the best Life Quotes in Telugu. Read motivational, inspirational, and success quotes in Telugu that give strength, positivity, and hope in life.

Author: Sai Gopal Gunturu

Leave a Comment