Motivational Quotes in Telugu

Updated On:
motivational quotes in telugu
---Advertisement---

జీవితం ఒక యుద్దభూమి,

పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది.

ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు.

ఆలస్యం అయినా పర్వాలేదు గానీ,

వేసే అడుగు బలంగా వేయాలి.!

ఎప్పుడూ కింద పడకపోవటం గొప్పకాదు,

పడినప్పుడల్లా మళ్లీ పైకి లేవటమే గొప్ప.

చేసే పనిని ప్రేమించ గలిగితే

ఎలాంటి పనైనా సృజనాత్మక స్థాయిని చేరుతుంది.

మన జీవితం అనేది ఒక పోరాటం.

ప్రతి ఆటకు ఒక అంచు ఉంటుంది,

ఆ అంచు మన బలాన్ని,

మన కృషిని పరీక్షించే చివరి మెట్టు.

మనం ఆ అంచును దాటినప్పుడు మాత్రమే

గెలుపు మన సొంతం అవుతుంది.

మన గమ్యం ఎప్పుడు చేరుతామో తెలియదు,

కానీ ఆ ప్రయాణాన్ని ఆస్వాదించడమే నిజమైన జీవితం.

మన కష్టాలు, సంతోషాలు, అనుభవాలు అన్నీ కలగలిసి

మన ప్రయాణాన్ని మరింత అందంగా చేస్తాయి.

అందరిలోనూ నువ్వు “బెస్ట్” అవ్వాలంటే

జీవితం లో “రెస్ట్” అనే పదాన్ని

కొంత కాలం మరచిపోవాలి..!

నస్టపోయావు అంతే, నాశనమై పోలేదు,

నీ కుటుంభం కోసం లేచి పోరాడు..!

ప్రతి శ్రమకు ఒక ఫలితం ఉంటుంది,

అది ఎప్పటికైనా నీ చేతికి చేరుతుంది.

నీ ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు,

ప్రతి క్షణం నీ విజయానికి దారి చూపిస్తుంది.

వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చలేక పోవచ్చు కానీ,

ముందుకు వెళ్ళి భవిష్యత్తుని మార్చుకోవచ్చు.!

ఈ రోజు నాది కాకపోవచ్చు. కానీ,

నాదంటూ ఏదో ఒక రోజు కచ్చితంగా వస్తుంది..!

సూర్యుడు చీకటిని చీల్చి వెలుగును ఇస్తాడు,

అలాగే నీ కష్టం నీ విజయాన్ని వెలుగులోకి తెస్తుంది.

నీ కలలు నిజం కావాలంటే,

నీ కృషి విరామం తీసుకోకూడదు.

ఓర్పు నీ మార్గం,

కష్టం నీ సాధనం,

విజయం నీ గమ్యం.

ఆత్మవిశ్వాసం నీ గెలుపుకి దారి,

కష్టాలు నీ విజయానికి పునాది.

నీ కృషి ఎంత పెద్దదో,

నీ గెలుపు అంత గొప్పదిగా ఉంటుంది.

ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు,

ఏదైనా సాధ్యమే.

విజయానికి దారి, కష్టం, ఓర్పు,

మరియు ఆత్మవిశ్వాసం.

అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది.

విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చుకోవాలి.

ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు

నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.

చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు.

పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది.

ఆలస్యం చేస్తే సులభమైన పని కూడా కష్టం అవుతుంది.

అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది.

ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల

ప్రతీ లక్షాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు.

నువ్వు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే,

నువ్వు ఎప్పుడూ చేయని కృషి చేయాలి.

Motivational Quotes in Telugu – జీవితాన్ని మార్చే తెలుగు మోటివేషన్ కోట్స్

మనిషి జీవితంలో ఎప్పటికప్పుడు ప్రేరణ (Motivation) చాలా అవసరం. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలంటే ముందుగా మనలో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంచేది మంచి ఆలోచనలు, మంచి స్ఫూర్తిదాయకమైన మాటలు. అందుకే Motivational Quotes ని చదివే అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇక్కడ చెప్పిన మోటివేషన్ సూక్తులు మన గుండెని తాకి, మనసుకు ధైర్యం ఇచ్చి, కొత్త మార్గాన్ని చూపగలవు.

ఇప్పటి వేగవంతమైన జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత సంబంధాలు – ఎక్కడ చూసినా ఒత్తిడి ఎక్కువగానే ఉంది. అలాంటి సమయంలో మనకు తోడుగా నిలిచేది ప్రేరణాత్మకమైన ఆలోచనలు. ఒక చిన్న సూక్తి కూడా మనలో గొప్ప మార్పు తీసుకురాగలదు. ఉదాహరణకు, “విజయం సాధించాలంటే ముందుగా ప్రయత్నించాలి” అనే చిన్న మాట మనల్ని బలంగా ముందుకు నడిపిస్తుంది.

ప్రతి ఒక విజయం సాధించిన వ్యక్తి వెనుక ఒక సంసల్పం ఉంటుంది. ఆ సంకల్పం ఇచ్చేది మోటివేషన్. తెలుగు మోటివేషనల్ కోట్స్ మనకు జీవన సత్యాలను గుర్తు చేస్తాయి. పట్టుదల (Determination), ఆత్మవిశ్వాసం (Self Confidence), క్రమశిక్షణ (Discipline) వంటి విలువలను నేర్పుతాయి.

Ex:

  • “అడ్డంకులు ఉన్నప్పుడే మన బలాన్ని నిరూపించుకోవచ్చు.”
  • “ఒకసారి ఓడిపోతే జీవితం ఆగిపోదు, మరింత బలంగా ప్రయత్నించాలి.”
  • “విజయం పొందే వరకు ప్రయాస ఆపకండి.”

ఇలాంటి చిన్న వాక్యాలు మనలో కొత్త ఉత్సాహం నింపుతాయి.

విద్యార్థులకు తెలుగు మోటివేషన్

విద్యార్థులు జీవితంలో పెద్ద పెద్ద కలలు కంటారు. కానీ వాటిని సాధించడానికి క్రమశిక్షణ, కష్టపడి చదవడం, సమయపాలన అవసరం. చాలా సార్లు వారు నిరుత్సాహానికి లోనవుతారు. అలాంటి సమయంలో ఒక మంచి motivational quote చదవడం ద్వారా మళ్ళీ ఉత్సాహం వస్తుంది.

Ex:

  • “చదువు అనేది కేవలం పరీక్షల కోసం కాదు, మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి.”

ఇలాంటి సూక్తులు విద్యార్థులలో సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి.

ప్రస్తుతం చాలామంది Instagram, WhatsApp, Facebookలో motivational quotes పోస్టులు పంచుకుంటున్నారు. మీరు మోటివేషనల్ సూక్తులు షేర్ చేస్తే, మీ స్నేహితులకు కూడా Motivate అవుతారు.

Motivational Quotes మన జీవితంలో మార్పు తీసుకువస్తాయి. ప్రతి ఒక్క quote లో మన ఆలోచనలను మార్చగల శక్తి ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ కొన్ని తెలుగు motivational quotes చదివే అలవాటు చేసుకోవాలి. ఇవి మనసుకు శాంతి, మన జీవితానికి దిశ, విజయానికి బలమైన పునాది ఇస్తాయి.

Discover powerful and inspiring Telugu motivational quotes to boost your confidence, spark positivity, and keep you focused on your goals every day.

Leave a Comment