Love Quotes in Telugu

Updated On:
love quotes in telugu
---Advertisement---

Love Quotes in Telugu | తెలుగు లవ్ కోట్స్

ప్రేమ అంటే మాటల్లో చెప్పలేని భావం. ప్రేమలో ఉన్నవారు తమ మనసులోని ఫీలింగ్స్‌ను ఎప్పుడూ share చేయాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆ భావాన్ని వ్యక్తపరచడానికి సరైన పదాలు దొరకవు. అప్పుడు Telugu Love Quotes చాలా ఉపయోగపడతాయి.

ఇక్కడ మీకోసం హృదయాన్ని తాకే తెలుగు లవ్ కోట్స్ ఉన్నాయి. వీటిని మీరు copy చేసి మీ WhatsApp, Instagram, Facebook లేదా Twitterలో share చేసుకోవచ్చు.

బంధం సుదీర్ఘంగా నిలవాలంటే

ప్రేమ మాత్రమే కాదు,

నమ్మకం కూడా అవసరం.

నువ్వు పరిచయం అయ్యాకే తెలిసింది.

స్నేహం ఇంత స్వచ్ఛమైనది.

ప్రేమ ఇంత మధురమైన భావమని.

బంధంలో గొడవలు ఉంటాయి,

కానీ ప్రేమ ఉంటే అవి మధుర

జ్ఞపకాలవుతాయి.

ప్రేమ అనేది ఒక చూపుతో మొదలై,

జీవితాంతం కొనసాగుతుంది.

నిన్ను చూసిన ప్రతీసారి

నా లోకం కొత్తగా మారిపోతుంది.

ప్రేమ అనేది పలికే మాటల్లో కాదు.

పలకకుండా చూసే కన్నుల్లో ఉంటుంది.

నేను నిన్ను కలిసే వరకు

నాకు తెలియని కల నువ్వు.💗

నా చీకటి రోజులను

ప్రకాశవంతం చేసే

సూర్యరశ్మి నీవు.

ప్రేమ కేవలం గమ్యం కాదు,

అది మనం కలిసి చేసే ప్రయాణం!

తీరాన్ని తాకి వెనక్కి వెళ్లిన కడలి కెరటాలు,

పడమర దిక్కున వాలిపోయిన సూర్యుడు,

మబ్బుల చాటుకి వెళ్లిన చందమామ,

తిరిగి వస్తుంటే ఎంత బాగుంటుందో కదా..!

నువ్వు కూడా అలా రావా..!!!🥰

నువ్వు దగ్గరుంటే గొడవపడాలి అనిపిస్తుంది…

దూరం అయితే దగ్గర అవ్వాలనిపిస్తుంది.

ఎలా అయినా నీతో ఉండాలనిపిస్తుంది.

బహుశా ఇదే ఇదేనేమో ప్రేమంటే..!

కాలాలు మారినా,

కళలు కనుమరుగయినా,

కవితలు అంతమయినా,

నేను నా ప్రాణాన్ని వీడినా,

నీ ప్రేమ కోసం… గాలినై మళ్ళీ వస్తాను.!

శరీరానికి గాయమవుతుందని తెలుసు కానీ,

హృదయం కూడా గాయపడుతుందని

నీవల్లే నాకు తెలిసింది.

నా మనసుకి మాటలొస్తే,

అది పలికే తొలిమాట

నువ్వంటే నాకిష్టమని

ప్రేమలో గెలుపోటములు ఉండవు 🥰,

ఇద్దరూ కలిసే గెలుస్తారు 💞.

ఇష్టం ప్రేమవుతుందని తెలియదు…

నువ్వు పరిచయం అయ్యేదాక..

ప్రేమ ప్రాణం అవుతుందని తెలియదు…

నిన్ను ప్రేమించేదాక..

నా ప్రాణం నువ్వే అని తెలియదు…

నీ చెంత చేరేదాక..

నిన్ను విడిచి ఉండలేను…

నా ఊపిరి ఆగేదాక..

నువ్వు ఎవరో

మొదట నాకు తెలియదు

కానీ నువ్వు పరిచయం

అయ్యాక తెలిసింది

నా సంతోషం నువ్వేనని!!

క్షణంలో పుట్టే ప్రాణం నిజమైనప్పుడు..

క్షణంలో వచ్చే చావు నిజమైనప్పుడు..

క్షణంలో పుట్టే ప్రేమ కూడా అంతే

నిజం అవుతుంది..!

ప్రేమ అనేది ఎప్పుడూ ప్రత్యేకమైనదే. మనసులో ఉన్న మాటలను అందంగా చెప్పడానికి ఈ Telugu Love Quotes మీకు ఉపయోగపడతాయి.

మీకు నచ్చిన Quotes‌ను copy చేసి మీ friends, partner, లేదా social mediaలో share చేయండి.

ప్రేమ అనే పదంలో ఎంత అర్ధం ఉందో చెప్పలేం. అది మనసును తాకుతుంది, జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఒక అందమైన అధ్యాయం. ఈ తెలుగు లవ్ కోట్స్ ద్వారా మీరు మీ మనస్సులోని భావాలను బయటకు చెప్పవచ్చు.

ప్రేమ అంటే కేవలం మాటలు కాదు. అది ఒక భావం, ఒక అనుభూతి. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే, వాళ్ల సంతోషమే మన సంతోషం అనుకుంటాము. అందుకే ఈ Love Quotes in Telugu చదివే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రేమను ఎక్కువగా అనుభవిస్తారు.

ఈ కోట్స్‌ని మీరు మీ ప్రియమైన వ్యక్తికి WhatsApp, Instagram, Facebook లేదా status గా పెట్టుకోవచ్చు. ప్రతి quote వెనుక ఒక అర్ధం ఉంటుంది. అది మనసును తాకి చిరునవ్వు తెప్పిస్తుంది.

ప్రేమలో ఉన్నవారికి, లేదా ఎవరికైనా తమ భావాలను వ్యక్తపరచాలనుకునేవారికి ఈ తెలుగు ప్రేమ కోట్స్ చాలా ఉపయోగపడతాయి. మీరు ఎవరికైనా “I Love You” చెప్పాలనుకున్నా, లేదా మీ relationship ని మరింత బలంగా చేసుకోవాలనుకున్నా, ఈ కోట్స్ ని షేర్ చెయ్యండి అద్భుతంగా ఉంటాయి.

ఇలాంటి తెలుగు ప్రేమ కోట్స్ చదవడం ద్వారా మనలోని భావాలు మళ్లీ మెల్లగా చిగురిస్తాయి. ప్రేమ అంటే చిన్న చిన్న జ్ఞాపకాల్లో, ఒక స్మైల్‌లో, ఒక మౌనంలో దాగి ఉంటుంది.

ప్రతి quote మనసులో ఒక కొత్త భావాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు నవ్విస్తుంది, కొన్నిసార్లు ఆలోచింపజేస్తుంది, కానీ చివరికి ప్రేమ మీద నమ్మకాన్ని పెంచుతుంది.

ప్రేమ అనేది జీవితానికి అర్థం ఇచ్చే ఒక శక్తి. మీరు ఈ Telugu Love Quotes చదివి ఆనందిస్తే, వాటిని మీ ప్రియమైన వారితో పంచుకోండి. ప్రేమ పంచుకుంటేనే మరింత పెరుగుతుంది ❤️

Leave a Comment